ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ లైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది . ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు . గ్రూప్-1లో 110 పోస్ట్లు , గ్రూప్-2లో 182 పోస్టులు భర్తీ చేస్తారు .
గతంలో ప్రకటించిన జాబ్స్ క్యాలెండర్ లో భర్తీ చేస్తామన్న పోస్టులు కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు విడుదల అయ్యాయి .
ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 సర్వీసుల్లో భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలు క్రింద ఉన్న లింక్ ద్వారా అధికారిక G.O ని డౌన్ లోడ్ చేసుకుని చూడండి .