AIIMS NURSING OFFICIER RECRUITMENT | NORCET 4 Notification 2023

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – న్యూ ఢిల్లీ (AIIMS -NEW DELHI) వారు నర్సింగ్ ఆఫీసర్స్ recruitment కొరకు కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ (NORCET) నిర్వహిస్తున్నారు.దీని కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట కాబడిన వారు ఎయిమ్స్- న్యూ ఢిల్లీ మరియు మిగతా దేశంలో గల మిగతా ఎయిమ్స్ సంస్థలలో  పోస్టింగ్ పొందుతారు.
మహిళలు మరియు పురుషులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
మొత్తం 3055 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
ఇందులో కేటగిరీ వారీగా పోస్ట్లు రిజర్వ్ చేయబడ్డాయి.
ఇందులో
  *UR – 1304
  *OBC (NCL)-808
  *SC-447
  *ST-198
  *EWS-298
-> తెలుగు రాష్ట్రాలలో  
ఎయిమ్స్ మంగళగిరి(ఆంధ్రప్రదేశ్) – 117
ఎయిమ్స్ బీబీనగర్ ( తెలంగాణ) –150 పోస్ట్లు వున్నాయని తెలియచేశారు..
√ముఖ్యమైన తేదీలు:
అధికారిక వెబ్సైట్ అయినటువంటి www.aiimsexams.ac.in
ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
*ప్రారంభ తేదీ:12/04/2023
*ముగింపు తేదీ:05/05/2023(సాయంత్రం 5:00 గంటలలోపు)
*CBT పరీక్ష తేదీ:03/06/2023(శనివారం)
*కరెక్షన్ లేదా ఎడిట్ రిజిస్ట్రేషన్:06/05/2023 నుండి 08/05/2023 వరకు.
√విద్యార్హతలు:
*1. B.sc(Hons.) Nursing/ B.sc( nursing) లేదా B.sc( పోస్ట్ – నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ B.sc( nursing) & రాష్ట్ర లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుండి నర్స్ మరియు మిడ్ వైఫ్ గా రిజిస్టర్ కావాలి.
(లేదా)
2.జనరల్ నర్సింగ్ మిడ్  వైఫెరీ లో డిప్లొమా చేసి, 50 పడకల హాస్పిటల్ లో 2 సంవత్సరాల వర్క్ అనుభవం ఉండాలి &రాష్ట్ర లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుండి నర్స్ మరియు మిడ్ వైఫ్ గా రిజిస్టర్ కావాలి.
నోట్: 1వ పాయింట్ లేదా 2 వ పాయింట్ లో ఏదో ఒక అర్హత వుంటే సరిపోతుంది.
√జీతం:
లెవెల్ -07 పే మాట్రిక్స్ ద్వారా రూ.9300-34800 బేసిక్ పే గల శాలరీ( గ్రేడ్ పే – రూ.4600/-) లభిస్తుంది.
√వయో పరిమితి:
* 18- 30 సంవత్సరాలు( అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయినటువంటి 05/05)2023 ను cut-off డేట్ గా నిర్ణయించారు.)
*కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
    ఎస్సీ/ ఎస్టీ లకు   : 5 సంవత్సరాలు
    ఓబీసీ లకు         :  3 సంవత్సరాలు
    ఎస్టీ కు  : 10 సంవత్సరాలు
    ఎక్స్-సర్వీస్ మెన్: 5 సంవత్సరాలు
వయోపరిమితి  లభిస్తుంది.
√సెలెక్టన్ విధానం: CBT పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.
√పరీక్షా విధానం:
*200 మార్కులకు గాను 200 ప్రశ్నలు ఇస్తారు(MCQS only),ఇందులో 180 ప్రశ్నలు సబ్జెక్ట్ ఆధారిత ప్రశ్నలు,20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు ఆప్టిట్యూడ్ ప్రశ్నలు.
*మూడు గంటల సమయంలో పూర్తి చేయాలి.
*ప్రతి తప్పు ప్రశ్నకి1/3వ వంతు నెగటివ్ మార్కింగ్ విధానం కలదు.
UR/EWS – 50 శాతం
OBC        – 45 శాతం
ఎస్సీ/ఎస్టీ -40 శాతం మార్కులు వస్తె CBT పరీక్షలో క్వాలిఫై అయినట్లుగా భావిస్తారు,అయితే దివ్యాంగులు వారికి ఇందులో  అదనపు 5 శాతం తగ్గింపు వుంటుంది.
√సిలబస్: నోటిఫకేషన్ లో ప్రస్తావించిన విద్యార్హత ను ఆధారంగా సిలబస్ వుంటుంది. 
√అప్లికేషన్ ఫీజు:
*జనరల్ & OBC అభ్యర్థులకు – రూ.3000/-
*ఎస్సీ&ఎస్టీ అభ్యర్థులకు         – రూ.2400/-
*దివ్యాంగులు                        – లేదు.
నోట్:ఎస్సీ&ఎస్టీ లకి నిర్ణయించబడిన అప్లికేషన్ ఫీజు పరీక్ష రాసిన అనంతరం రీఫండ్ చేయబడుతుంది. 
√అప్లై చేయు విధానం:ఆన్లైన్ ద్వారా అధికారిక website లో అప్లై చేసుకోవాలి.
√ముఖ్యమైన అంశాలు:
*అప్లై చేసుకునేటప్పుడు ఫోటో,సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ “upload image instructions” ప్రకారం అప్లోడ్ చేయాలి.
*ఎస్సీ,ఎస్టీ&OBC అభ్యర్థులు valid caste certificate ను సబ్మిట్ చేయాలి.
*OBC-NCL వారు& EWS వారు 2023-24 ఆర్థిక సంవత్సరం ఆధారంగా సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలి.
* దివ్యాంగులు వారు valid disability certificate ను సబ్మిట్ చేయాలి.
√ఇతరములు: అప్లై చేసేటప్పుడు ఏవైనా సందేహాలు లేదా టెక్నికల్ సమస్యలు ఎదురైతే
Toll-Free Number 1800117898
(Timings 10:00 AM to 05:00 PM – Monday to Friday &
10.00 AM to 1.00 PM – Saturday)
 
For full notification – Click here.


✅ Apply Link – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top