ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడ వారు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ చేసేందుకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట కాబడిన అభ్యర్థులకు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వారికి నెలకు రూ.9000/-
టెక్నీషియన్ అప్రెంటిస్ వారికి నెలకు రూ.8000/- స్టైఫండ్ లభిస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య – 100
ఇందులో
*గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ -30
*టెక్నీషియన్ -70
కలవు.
√ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ ద్వారా NATS పోర్టల్ ద్వారా ఎన్రోల్ అవడానికి ప్రారంభ తేదీ:07/04/2023.
√విద్యార్హతలు:
పోస్టును బట్టి అర్హతలు అవసరం అవుతాయి.
*గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – B.tech (EEE)
* టెక్నీషియన్( డిప్లొమా అప్రెంటిస్)- డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (DEEE)
√వయో పరిమితి:
* అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం వయోపరిమితి అనుసరించబడుతుంది, 18 సంవత్సరాలు మరియు ఆ పైన వయస్సు కల వారు అర్హులు అవుతారు.
√సెలెక్టన్ విధానం:అభ్యర్థికి తన అకడమిక్ క్వాలిఫికేషన్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
√ట్రైనింగ్ కాల వ్యవధి:
అప్రెంటిస్‌షిప్ శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం పాటు వుంటుంది.
√అప్లై చేయు విధానం: ఆన్లైన్ ద్వారా అధికారిక website www.mhrdnats.gov.in లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి,ఆ తర్వాత అప్లై చేసుకోవాలి.
√ఇతరములు: వెబ్ పోర్టల్‌లో విద్యార్థుల నమోదుకు సంబంధించిన సందేహాల కోసం, ఈ మెయిల్ studentquery@boat-srp.com,
applacement@boat-srp.com ను సంప్రదించవచ్చు.
For full notification – click here.