District Consumers Commission Recruitment

వినియోగదారుల కమిషన్లో ఉద్యోగాలు

 

శ్రీకాకుళం జిల్లా వినియోగదారుల కమిషన్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ , జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్లు కమిషన్ ప్రెసిడెంట్ ఆర్ . చిరంజీవి తెలిపారు . ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు . నెలకు రూ .18,500 ల గౌరవ వేతనం ఉంటుందన్నారు . అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు . ఇంటర్ , గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది .. 18 నుంచి 42 ఏళ్ల వయసు కలిగి ఉండాలన్నారు . స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ , షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు . పై అర్హతలు లేనివారు లేకుంటే లోయర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అవకాశం ఉంటుందన్నారు . నైపుణ్య పరీక్ష , ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు .. ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును ప్రెసిడెంట్ , డిస్ట్రిక్ట్ కమిషన్ , జిల్లా కోర్టు , శ్రీకాకుళం చిరునామా లో ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోగా అందజేయాలన్నారు .

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top