భారత వాతావరణ శాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 18 లోపు అప్లై చేయాలి.
ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్ష 2022 డిసెంబర్లో నిర్వహించబోతున్నట్లు తాత్కాలిక షెడ్యూల్లో నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు .
30 సంవత్సరాలు లోపు యువతీ , యువకులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు .
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు .
మొత్తం 990 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది .
పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు .
ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది .
అర్హత : 10+2 ( సైన్స్ , ఫిజిక్స్ , మ్యాథమెటిక్స్ ) తో పాటు బ్యాచిలర్ డిగ్రీ ( కంప్యూటర్ సైన్స్ / భౌతిక శాస్త్రం / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ అప్లికేషన్స్ ) లేదా డిప్లమో ( ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ) పూర్తి చేసిన వారు అర్హులు .
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింకులపై క్లిక్ చేయండి .
▶️ Website