YSRCP Mega Job mela details | YSRCP Job mela Rigistration

AP లో వివిధ ప్రైవేటు సంస్థలో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వైయస్సార్సిపి పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి , విశాఖపట్నం , గుంటూరు లలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు .

 

వైఎస్సార్సీపీ అభిమానులు మరియు కార్యకర్తలు కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గా తెలపడం జరిగింది .

 

10వ తరగతి నుంచి Ph.D వరకు అర్హతగల అభ్యర్థులు ఈ జాబ్ మేళా కు హాజరు కావచ్చు .

 

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 మరియు 17 వ తేదీల్లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు . అనంతపురం , కడప , కర్నూలు , చిత్తూరు , నెల్లూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ జాబ్ మేళా కు హాజరు కావచ్చు .

 

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏప్రిల్ 23 24 తేదీల్లో జాబ్ మేళా జరుగుతుంది . శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం , తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఇక్కడ జరిగే జాబ్ మేళా కు హాజరు కావచ్చు .

 

 

గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ఏప్రిల్ 30 మరియు మీ 1వ తేదీ లో జాబ్ మేళా జరుగుతుంది . కృష్ణ , గుంటూరు, ప్రకాశం , పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ జాబ్ మేళా కు హాజరు కావచ్చు .

 

జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకొని జాబ్ మేళా కు హాజరు కావాలి .

 

రిజిస్ట్రేషన్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ లో మీ వివరాలు నమోదు చేయండి .

 

 

▶️ Website Link 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top