తెలంగాణలో మరో పది రోజుల్లో 12,755 వైద్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు . ఈ ఉద్యోగాల్లో అత్యధికంగా స్టాఫ్ నర్స్ పోస్టులు 4722 , ఏఎన్ఎం పోస్టులు 1520 , ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లు 2000 మరియు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తారు.
వైద్యులు ఉద్యోగాలను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్ , ఏఎన్ఎం వంటి ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది . ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు సిలబస్ తయారు చేసే పనిలో కమిటీలు నిమగ్నం అయ్యాయి.
సిలబస్ పై కసరత్తు పూర్తి అయ్యాక నోటిఫికేషన్ విడుదల చేస్తారు.