డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ కళాశాలలో సెమిస్టర్ ప్రాతిపదికన సబ్జెక్ట్ అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హత , ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 18వ తేదీన మార్చిలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్.ఏ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు . ఎంపికైన అభ్యర్థులు వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ , సీఎస్ఈ , మెకానికల్ విభాగాల్లో సబ్జెక్ట్ కాంట్రాక్టు అధ్యాపకులుగా పని చేయాల్సి ఉంటుందన్నారు. వీటికి సంబంధించిన పాఠ్యాంశాల్లో అభ్యర్థులు ఎంటెక్ డిగ్రీ ప్రథమ శ్రేణిలో 60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. సబ్జెక్ట్ కాంట్రాక్టు అధ్యాపకులుగా పని చేయాలని ఆసక్తి ఉండేవారు , అర్హులైన అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకొని వివరాలు పూర్తి చేసి సర్టిఫికెట్లతో వాక్యం ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన కోరారు . ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ఈనెల 18న వాటిలో నిర్వహిస్తారు .
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కోసం వర్సిటీ వెబ్ సైట్ ను సందర్శించాలని ఆయన కోరారు .