IRDAI ASSISTANT MANAGER JOBS | CENTRAL GOVERNMENT JOBS

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ 45 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ కాబడితే ప్రారంభంలోనే 1,30,000/- జీతం లభిస్తుంది.

ఈ సంస్థ పార్లమెంట్ ద్వారా చట్టబద్ధం చేయబడిన సంస్ధ.
ఈ 45 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను కేటగిరీ వారీగా రిజర్వ్ చేయబడ్డాయి.

జనరల్ కేటగిరీ  : 20
EWS కేటగిరీ     :04
OBC కేటగిరీ     :12
ఎస్సీ కేటగిరీ      :06
ఎస్ టి కేటగిరీ    :03
@ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి
 *మొదటి తేదీ:11.04.2023
 *చివరి తేదీ:10.05.2023
 *ఫేస్ 1ప్రిలిమినరీ పరీక్ష తేదీ: అధికారిక వెబ్సైట్                ద్వారా తర్వాత కాలంలో తెలియచేస్తారు.
@విద్యార్హతలు: మొత్తం 6 రకాల స్ట్రీమ్ లలో ఉద్యోగాల భర్తీ జరుపుతున్నారు 
పోస్టును బట్టి వివిధ రకాల అర్హతలు అవసరం అవుతాయి.

*Actuarial: 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత మరియు IAI 7  పేపర్లలో ఉత్తీర్ణత(5 పోస్ట్లు వున్నాయి)
*Finance:60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత మరియు ACA/AICWA/ACMA/ACS/CFA(5 పోస్ట్లు వున్నాయి)
*Law: 60 శాతం మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణత (5 పోస్ట్లు వున్నాయి)
*IT: ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాలలో 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత(5 పోస్ట్లు వున్నాయి)
*Research:ఎకనామిక్స్ / ఎకనామెట్రిక్స్ / క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ /
మ్యాథమెటికల్ ఎకనామిక్స్ / ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కోర్సు/
గణాంకాలు/ గణిత గణాంకాలు/అనువర్తిత గణాంకాలు లో  60 శాతం మార్కులతో మాస్టర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత (5 పోస్ట్లు వున్నాయి)
*Generalistic: 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత(20 పోస్ట్లు వున్నాయి)
@వయో పరిమితి:
*కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
    ఎస్సీ/ ఎస్టీ లకు   : 5 సంవత్సరాలు
    ఓబీసీ లకు         :  3 సంవత్సరాలు
    దివ్యాంగులు కు  : 10 సంవత్సరాలు
    ఎక్స్-సర్వీస్ మెన్: 3 సంవత్సరాలు
    వయోపరిమితి  లభిస్తుంది.
@సెలెక్టన్ విధానం: మొత్తం మూడు దశలలో సెలక్షన్ జరుపుతారు.
*ఫేజ్ I:ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
టెస్ట్ ఆఫ్ రీజనింగ్- 40 ప్రశ్నలు 40 మార్కులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష-40 ప్రశ్నలు 40 మార్కులు
జనరల్ అవేర్‌నెస్ పరీక్ష -40 ప్రశ్నలు 40 మార్కులు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పరీక్ష -40 ప్రశ్నలు 40 మార్కులు
మొత్తం 160 మార్కులకు,160 ప్రశ్నలను ఇస్తారు 
90 నిముషాల కాలపరిమితి తో పూర్తి చేయాలి.
*ఫేజ్ 2:3 పేపర్లతో కూడిన డిస్క్రిప్టివ్ పరీక్ష (పేపర్ I, II మరియు III)
->పేపర్-I: ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ : 100 మార్కులకు గాను 60 నిముషాల సమయం ఇస్తారు.
->పేపర్-II: ఎకనామిక్ అండ్ సోషల్:
బీమాపై ప్రభావం చూపే సమస్యలు100 మార్కులకు గాను 60 నిముషాల సమయం ఇస్తారు.
->పేపర్-III: బీమా మరియు
నిర్వహణ:100 మార్కులకు గాను 60 నిముషాల సమయం ఇస్తారు.
*ఫేజ్ 3: ఇంటర్వ్యూ
@పరీక్షా కేంద్రాలు:
*ఫేజ్ I:ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష : తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ(ఆంధ్రప్రదేశ్),హైదరాబాద్ ( తెలంగాణ).
*ఫేజ్ 2:హైదరాబాద్, కొల్ కత్తా,ముంబై, ఢిల్లీ.
@అప్లికేషన్ ఫీజు:
*జనరల్/ ఓబీసీ/EWS వారికి రూ.750/-
*ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులు వారికి రూ.100/-
@అప్లై చేయు విధానం:  ఆన్లైన్ ద్వారా అధికారిక website లో అప్లై చేసుకోవాలి.
@ఇతరములు:రిక్రూట్‌మెంట్‌పై మరిన్ని అప్‌డేట్‌లు కొరకు IRDAI అధికారిక వెబ్సైట్ (www.irdai.gov.in)యొక్క ‘కెరీర్స్’ ట్యాబ్‌ను సందర్శించాలని అభ్యర్థులకు సలహా ఇవ్వబడింది
For full notificationclick here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top