జల్ శక్తి మంత్రిత్వ శాఖ లో గల జాతీయ నీటి అభివృద్ధి సంస్థ( నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ) వారు శాశ్వత ప్రాదిపాతికన వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీని కొరకు advertisememt no 14/2023 ను రిలీజ్ చేశారు. మొత్తం పోస్టుల సంఖ్య – 40
ఇందులో
*జూనియర్ ఇంజనీర్ ( సివిల్) :13
*జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ :01
*డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ -3 :06
* అప్పర్ డివిజనల్ క్లర్క్ :07
*స్తెనోగ్రాఫర్ గ్రేడ్ -2 :09
*లోవర్ డివిజనల్ క్లర్క్ :04
వున్నాయి.
√ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి
*మొదటి తేదీ:18/03/2023
*చివరి తేదీ:17/04/2023(అర్ధరాత్రి)
*పరీక్ష నిర్వహించే తేదీ: అధికారిక వెబ్సైట్ ద్వారా తర్వాత కాలంలో తెలియచేస్తారు.
√విద్యార్హతలు:
పోస్టును బట్టి వివిధ రకాల అర్హతలు అవసరం అవుతాయి.
*జూనియర్ ఇంజనీర్ ( సివిల్) : సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా తత్సమానం
*జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ : కామర్స్ డిగ్రీ తో పాటు మూడు సంవత్సరాల అనుభవం
*డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ -3 : డ్రాఫ్ట్ మెన్ ఇన్ సివిల్ లో ఇటిఐ లేదా డిప్లొమా
* అప్పర్ డివిజనల్ క్లర్క్ : ఏదైనా డిగ్రీ
*స్తెనోగ్రాఫర్ గ్రేడ్ -2 : 12 వ తరగతి( ఇంటర్మీడియట్) తో పాటు షార్ట్ హ్యాండ్(80 wpm) వచ్చియుండాలి.
*లోవర్ డివిజనల్ క్లర్క్ : 12 వ తరగతి( ఇంటర్మీడియట్) తో పాటు టైపింగ్(ఇంగ్లిష్ లో 35 wpm లేదా హిందీలో 30 wpm) టైప్ చేయగలిగే సామర్ధ్యం వుండాలి.
√వయో పరిమితి:
*జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ కి తప్ప మిగతా అన్ని పోస్టులకు కూడా వయస్సు 18 నుండి 27 సంవత్సారాలు లోపు వుండాలి.
*జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ కి 21 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
*కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
ఎస్సీ/ ఎస్టీ లకు : 5 సంవత్సరాలు
ఓబీసీ లకు : 3 సంవత్సరాలు
దివ్యాంగులు కు : 10 సంవత్సరాలు
ఎక్స్-సర్వీస్ మెన్: 3 సంవత్సరాలు
వయోపరిమితి లభిస్తుంది.
√సెలెక్టన్ విధానం:
రెండు స్టేజ్ లలో సెలక్షన్ జరుపుతారు.
*ఫస్ట్ స్టేజ్ : ఓఏంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు,ఇందులో 90 నిముషాలకు గాను 100 మార్కుల కు పరీక్ష MCQS వుంటాయి.
*సెకండ్ స్టేజ్: డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుపుతారు.
ఇందుకు గాను మొదటి స్టేజ్ లో
జనరల్/ ఓబీసీ/EWS అభ్యర్దులు లో ఒక పోస్ట్ కి 20 మంది నిష్పత్తిలో,
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు లో ఒక పోస్ట్ కి 50 మంది నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.
√అప్లికేషన్ ఫీజు:
*జనరల్/ ఓబీసీ/EWS వారికి రూ.890+ GST+ బ్యాంక్ ఛార్జీలు.
*ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులు వారికి రూ.550+ GST+ బ్యాంక్ ఛార్జీలు.
√అప్లై చేయు విధానం: ఆన్లైన్ ద్వారా అధికారిక website లో అప్లై చేసుకోవాలి.
√ఇతరములు: అప్లై చేసేటప్పుడు ఏవైనా సందేహాలు లేదా టెక్నికల్ సమస్యలు ఎదురైతే
helpdesk.nwda.recruitment@gmail.com లేదా Number: +919453819323 ను సంప్రదించవచ్చు.
For full notification – click here.