గవర్నమెంట్ ఆఫ్ ఇండియా , మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధి లో గల ఎంటర్ ప్రైస్ , డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( DFCCIL) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా , వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చు. ఒక సంవత్సరం కాంట్రాక్టు ప్రాధిపతికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.అవసరాన్ని బట్టి ఈ ఉద్యోగాల కాలపరిమితి పొడిగింపు వుంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మేనేజర్ , ఎక్జిక్యూటివ్ , ఎగ్జిక్యూటివ్ ( ఎలక్ట్రికల్ ) , ఎగ్జిక్యూటివ్ ( సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్) , మల్టి టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 642 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
జూనియర్ మేనేజర్ – 03
ఎక్జిక్యూటివ్ ( సివిల్) – 36
ఎగ్జిక్యూటివ్ ( ఎలక్ట్రికల్ ) – 64
ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్) – 75
మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 464
🔥 విద్యార్హత :
ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
మల్టి టాస్కింగ్ స్టాఫ్ : పదవ తరగతి ఉత్తీర్ణత తో పాటు కనీసం ఒక సంవత్సర కాలం వ్యవధితో 60 శాతం మార్కులతో ఐటిఐ కోర్సు పూర్తి చేసి వుండాలి.
ఎగ్జిక్యూటివ్ : సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
జూనియర్ మేనేజర్ : CA/ CMA ఉత్తీర్ణత సాధించాలి.
🔥 వయస్సు :
జూనియర్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు వున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల లోపు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబిసి ( నాన్ క్రీమీ లేయర్ ) అభ్యర్థులకు 3 సంవత్సరాలు , దివ్యాంగులు వారికి 10 సంవత్సరాలు వయొసడాలింపు కలదు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపిక విధానం :
జూనియర్ మేనేజర్ , ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు CBT 1& CBT 2 పరిక్ష లతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ CBT 1& CBT 2 పరిక్ష లతో PET , డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
CBT 1& CBT 2 లో ¼ వ వంతు నెగెటివ్ మార్కింగ్ విధానం కలదు.
🔥 CBT పరిక్ష విధానం:
CBT – 1 :
CBT- 1 పరిక్ష ను 100 మార్కులకు గాను నిర్వహిస్తారు. 90 నిముషాల సమయం కేటాయించారు. ఇందులో మాథెమాటిక్స్ ( 30 మార్కులు) , జనరల్ అవేర్నెస్ ( 15 మార్కులు) , జనరల్ సైన్స్ ( 15 మార్కులు) , లాజికల్ రీజనింగ్ / జనరల్ ఇంటెలిజెన్స్ ( 30 మార్కులు) , రైల్వే / DFCCIL పై నాలెడ్జ్ ( 10 మార్కులు) వుంటాయి.
CBT – 2 :
CBT- 2 పరిక్ష ను 120 మార్కులకు గాను నిర్వహిస్తారు. 120 నిముషాల సమయం కేటాయించారు.
🔥 పరీక్ష కేంద్రాలు :
CBT -1 పరీక్ష దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం , తెలంగాణ లోని హైదరాబాద్ లలో పరీక్ష నిర్వహిస్తారు.
CBT-2 పరీక్ష ఢిల్లీ , కొలకత్తా , ముంబై, చెన్నై లలో నిర్వహిస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
జూనియర్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 1000/- రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 500/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥జీతం :
అభ్యర్థులు ఎంపిక కాబడిన పోస్ట్ ఆధారంగా జీతం లభిస్తుంది.
జూనియర్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపిక అయిన వీరికి 50,000/- – 1,60,000/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.
ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 30,000- 1,20,000/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.
MTS ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 16,000/- – 45,000/- రూపాయల పే స్కేల్ వర్తిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 18/01/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 22/03/2025
,