భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ పరిధిలో గల రైల్ వీల్ ఫ్యాక్టరీ (RWF) సంస్థ నందు 2024-25 సంవత్సరానికి గాను వివిధ విభాగాలలో గల అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్ , మెకానిస్ట్ , మెకానిక్ ( మోటార్ వెహికల్) ,టర్నర్ , CNC ప్రోగ్రామింగ్ కం ఆపరేటర్ , ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లలో మొత్తం 192 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అవసరమగు విద్యార్హతలు , వయస్సు , దరఖాస్తు చేయు విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
రైల్ వీల్ ఫ్యాక్టరీ (RWF) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 192 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు & ఖాళీల వివరాలు:
ఫిట్టర్ – 85
మెకానిస్ట్ – 31
మెకానిక్ ( మోటార్ వెహికల్) – 8
టర్నర్ – 5
CNC ప్రోగ్రామింగ్ కం ఆపరేటర్ – 23
ఎలక్ట్రీషియన్ – 18
ఎలక్ట్రానిక్ మెకానిక్ – 22
🔥 విద్యార్హత :
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10 వ తరగతి లేదా తత్సమాన అర్హత సాధించాలి.
నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ( NCVT) సంస్థ నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి వుండాలి.
🔥 వయస్సు:
తేది: 01/03/2025 నాటికి 15 సంవత్సరాలు నిండి యుండి 24 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
గరిష్ట వయస్సు నిర్ధారణ లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాలు , వయో సడలింపు కలదు.
🔥దరఖాస్తు చేయు విధానం :
అభ్యర్థులు నోటిఫికేషన్ లో ప్రస్తావించిన దరఖాస్తు ఫారం ను నింపి, దరఖాస్తు యొక్క ఎన్వలప్ పై “Application for undergoing training under the apprentice’ Act ,1961 for the year 2024-25 in Rail wheel factory” అని రాసి పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తు తేది: 01/04/2025 సాయంత్రం 5:00 గంటల లోగా కార్యాలయానికి చేరాలి.
🔥 దరఖాస్తు పంపవలసిన చిరునామా:
The Assistant personnel officer – II,
Personnel department,
Rail Wheel factory,
Yelahanka,
Bangalore – 560064.
🔥 అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు 100/- రూపాయల అప్లికేషన్ ఫీజును ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా “principal financial adviser/ Rail Wheel factory” పేరు మీదుగా చెల్లించాలి.
ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు , మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతం:
ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రాం కి ఎంపిక కాబడిన ఫిట్టర్ , మెకానిస్ట్, మెకానిక్ ( మోటార్ వెహికల్), టర్నర్ , ఎలక్ట్రీషియన్ , ఎలక్ట్రానిక్ మెకానిక్ వారికి నెలకు 12,261/- రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
CNC ప్రోగ్రామింగ్ కం ఆపరేటర్ గా ఎంపిక కాబడిన వారికి నెలకు 10,899/- రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
పదవ తరగతి లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
అభ్యర్థులు 01/04/2025 ( 17:00 గంటలు) తేదీలోగా దరఖాస్తు పంపించాలి.
👉 Click here for official notification & Application
👉 Click here for official website