సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CSIF) సంస్థ నుండి పురుష మరియు మహిళా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునే విధంగా కానిస్టేబుల్ / ట్రేడ్స్ మెన్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1161 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CSIF) ఈ ఉద్యోగాల భర్తీ చేస్తుంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 1161 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు& ఖాళీల వివరాలు:
కుక్ – 493
కోబ్లర్ – 09
టైలర్ – 23
బార్బర్ – 199
వాషర్ మాన్ – 262
స్వీపర్ – 152
పెయింటర్ – 02
కార్పెంటర్ – 09
ఎలక్ట్రీషియన్ – 04
మాలి – 04
వెల్డర్ – 01
ఛార్జ్ మెక్ – 01
ఎంపి అటెండెంట్ – 02
🔥 విద్యార్హత :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదవతరగతి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి ట్రెయిన్ చేయబడిన వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
విద్యార్హత నిర్ధారణ కొరకు 03/04/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥 వయస్సు :
18 సంవత్సరాలు నిండి 23 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు లభిస్తుంది.
ఓబీసీ లకు 3 సంవత్సరాల వయొసడలింపు లభిస్తుంది.
వయస్సు నిర్ధారణ కొరకు 01/08/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.
🔥దరఖాస్తు విధానం :
అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు 1000/- రూపాయల దరఖాస్తు ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
మహిళా అభ్యర్థులకు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు వుంది.
🔥 ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ / ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ & డాక్యుమెంటేషన్ & ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఇందులో షార్ట్ లిస్ట్ కాబడిన వారికి ఓ ఎం ఆర్ ఆధారిత వ్రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహిస్తారు.
చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి , ఎంపిక చేస్తారు.
🔥జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి లెవెల్ – 03 పే స్కేల్ ( 21,700 – 69,100 ) తో పాటు అన్ని రకాల అలౌవన్స్ లు లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 05/04/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 03/04/2025 ( 23:59 గంటలు )
👉 Click here for official notification