తెలంగాణలో 12,755 వైద్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు . ఈ ఉద్యోగాల్లో అత్యధికంగా స్టాఫ్ నర్స్ పోస్టులు 4722 , ఏఎన్ఎం పోస్టులు 1520 , ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లు 2000 మరియు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తారు.
వైద్యులు ఉద్యోగాలను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్ , ఏఎన్ఎం వంటి ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది . 80 శాతం మార్కులు రాత పరీక్ష కి 20 శాతం మార్కులు గతంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో పని చేసిన వారికి వెయిటేజీ వర్తిస్తుంది .
ముందుగా 1,326 వైద్యం పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు . అక్కడ నుంచి వారం రోజుల్లో మిగతా నోటిఫికేషన్స్ విడతల వారీగా విడుదల చేయడం జరుగుతుంది .
దీనికి సంబంధించి వివిధ దిన పత్రికలో వచ్చిన వివరాలు క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేయండి .